ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రపంచ స్థాయిలో సింగరేణిని అద్భుతంగా విస్తరిస్తామని ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం సింగరేణి జిఎం కార్యాలయంలో వర్క్ షాప్ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి విస్తరణకు సంబంధించి సూచనల కోసం ఒక కమిటీని నియమించామని, దాని నివేదిక రాగానే కార్యాచరణ చేపడతామన్నారు. వంద సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్న సింగరేణినిలో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి లాభదాయకమైన రీతిలో తవ్వకాలు జరపాలన్న యోచనలో ప్రజాప్రభుత్వం వున్నదన్నారు.
రాబోయే 30 సంవత్సరాల కాలం పాటు 22 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం సింగరేణి కార్మికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతని స్తుందన్నారు. వ్యాపారం దీని తర్వాతనేనన్నారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ప్రమాద బీమా తో పాటు కారుణ్య నియామకం చేపడుతున్నామని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు.





