అందరూ గర్వంగా చెప్పుకునేలా సిద్దిపేట అభివృద్ధి

– ఇఫ్తార్ విందులో హరీష్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 9: సిద్ధిపేట అంటే గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసుకున్నాం.. మీ అందరి దీవెనలతో ఇలానే అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆరఎస్ ఉప నాయకుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో షాదీఖానా ఎక్కడైనా ఉంది అంటే సిద్దిపేటలోనే. హైదరాబాద్ తర్వాత ఇక్బాల్ మినార్ ఎక్కడైనా ఉంది అంటే అది సిద్దిపేటలోనే.. ఆఖరికి సఫర్‌కి గాడీ దేశంలోనే మొద{గా సిద్దిపేటలో ప్రారంభించాం.. హైదరాబాద్ తర్వాత హజ్ హౌస్ సిద్దిపేటలోనే ఉంది.. సిద్దిపేటలో 700 డబుల్ బెడ్ రూమ్‌లను ముస్లిం సోదరులకు ఇచ్చాం.. అని వివరించారు. తెలంగాణ రాకముందు రంజాన్ వచ్చిందంటే కరెంట్ కట్ చేయొద్దని ముందు సమీక్షలు పెట్టుకునే వాళ్ళం.. కేసీఆర్ వచ్చాక అలాంటి పరిస్థితి లేదు. నీళ్లు, కరెంట్, గ్యాస్‌కు ఇబ్బందులు లేవు.. రంజాన్ తోఫా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు.. ఇమామ్, మొజామ్‌లకు జీతాýT దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అందించారు అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులను నిర్వహించింది కేసీఆర్ ఉమ్మడి ఆంధ్ణ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరపున మొట్టమొదట రంజాన్ ఇఫ్తార్ సిద్దిపేటలో మొదలైంది అని అన్నారు. అల్లా దీవెనలతో అందరూ బాగుండాన్నారు. ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో నిరుపేద ముస్లింలను ఉమ్రాకు పంపిస్తున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని హరీష్‌రావు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *