– క్షేమంగా భూమ్మీదకు చేరిక
– ప్రధాని మోదీ తదితరుల శుభాకాంక్షలు
కాలిఫోర్నియా, జూలై 15: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్ర ముసిగింది. ఆయన తిరగి భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్స్‌లో కాలిఫోర్నియా సపంలోని సముద్ర జలాలలో మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు సురక్షితంగా దిగారు. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ తెలిపారు. అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. కాగా, భూమిపైకి చేరుకున్న ఈ వ్యోమగాముల బృందాన్ని ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు స్పేస్ ఎక్స్ అధికారులు తెలిపారు. శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన యాక్సియం-4 మిషన్ బృందం స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమ నౌకలో సోమవారం బయలుదేరింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ, టిబర్ కపులు ఈ బృందంలో ఉన్న సంగతి తెలిసిందే. శుభాంశు తిరిగి భూమికి వచ్చిన సందర్భంగా స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
గగన్‌యాన్‌కు శుభాంశు అనుభవం జోడింపు: ఇస్రో
న్యూదిల్లీ: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్‌ఎస్ వెళ్లి క్షేమంగా తిరిగి రావడంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్పందించింది. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో శుక్లా సొంతం చేసుకున్న అనుభవం గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో కీలకం కానుందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ ఈ యాత్ర విజయంతో రోదసి రంగంలో భారత్ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంది.. ఇది యావత్ ప్రపంచానికి గర్వకారణం.. ఈ క్షణం భారత్‌కు మాత్రం అత్యంత ప్రత్యేకమైనదని హర్షం వ్యక్తం చేశారు. గగన్‌యాన్ యాత్రను 2027 తొలి తైమ్రాసికంలో చేపట్టే అవకాశాలున్నట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఇటీవల వెల్లడిరచారు. బృందం భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే