మెడల్స్ సాధించిన అథ్లెట్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

– మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ -2026 సెకండ్ ఎడిషన్ సందర్భంగా నేషనల్ మాస్టర్స్ అథ్లెట్స్ అసోసియేషన్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి మెడల్స్ సాధించిన అథ్లెట్స్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్ర‌వారం అభినందించారు. 30 ఏళ్ల నుంచి 70ఏళ్లకు పైబడిన వారు వివిధ అథ్లెట్స్‌లో మెడల్స్ సాధించి భారత, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటారన్నారు. వీరిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి వాకిటి పిలుపునిచ్చారు. ఈ అభినందన కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ వీసీ సోని బాలాదేవి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *