నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

 జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌  ప్రభుత్వం, రాహుల్‌ గాంధీ ఆలోచన విధానాలకు విరుద్దంగా సోషల్‌ మీడియాపై నిఘా పెడుతూ ,  సర్కార్ ను ప్రశ్నిస్తున్న జెన్‌జీలపై కేసులు పెట్టాలనుకోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
ప్రపంచ వ్యాప్తంగా జెన్‌జీ ఉద్యమాలు ట్రెండింగ్‌ గా మారాయి. చాలా దేశాల్లో జెన్‌ జీలు ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. అమెరికా నుంచి నేపాల్‌ వరకూ..రష్యా నుంచి ఫ్రాన్స్‌ వరకూ యూరప్‌ నుంచి అరబ్‌ కంట్రీస్ వరకూ జెన్‌ జీ ఉద్యమాలు కనిపిస్తున్నాయి. భారత్ వంటి  దేశాల్లో జెన్‌జీలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు.. ఇండియాలో అలాంటి భౌతిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ మహారాష్ట్ర నుంచి బెంగాల్‌ వరకూ దేశంలో అనేక రాష్ట్రాల్లో అక్కడక్కడ జెన్‌ జీలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. లడ్డాఖ్‌లో అలాంటి పరిస్థితులు కనిపించాయి. అయితే భారత్ లో  జెన్‌జీల వ్యతిరేకత ఆందోళనలు, ధర్నాల స్థాయిలోనే ఉన్నాయి. అవి ఇంకా తిరుగుబాటు స్థాయికి చేరలేదు.
ప్రపంచ వ్యాప్తంగానే కాదు దేశంలో జెన్‌జీల్లో తిరుగుబాటుకు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక , నెపొటిజం వంటి అనేక కారణాలున్నప్పటికీ ముఖ్యంగా సోషల్‌ మీడియాపై ప్రభుత్వాల నియంత్రణ, నిఘా, నిషేధించడం, ప్రభుత్వాన్ని, నెఫోటిజాన్ని, ప్రజల సొమ్మును సర్కార్‌ దుబారా ఖర్చులపై ప్రశ్నించడంతో పాటు ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, సామాజిక అణిచివేతలను ప్రశ్నించే జెన్‌ జీలను కఠినంగా అణిచివేస్తూ, అక్రమ కేసులు పెట్టుతూ, చివరికి సోషల్‌ మీడియానే బ్యాన్ చేయడంపై  ఆయా దేశాల్లో జెన్‌జీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.
ఒకవైపు వరల్డ్ వైడ్‌గా, దేశంలోని లడ్డాఖ్‌ వంటి ప్రాంతాల్లో జెన్‌జీల తిరుగుబాటులను చూస్తున్న ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో సామాజిక మాధ్యమాలపై నిఘాపెట్టడం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం, ఉద్యోగాలు, ఇచ్చిన హమీలు, అధికార పార్టీ నేతల కుటుంబాలు చేస్తున్న దారుణాలను ప్రశ్నిస్తున్న వారిపై రౌడీషీట్స్‌ పెట్టాలని పోలీస్‌ శాఖను ఆదేశించడం అంటే నిప్పుతో ప్రభుత్వం గొక్కున్నట్లే అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటూ ఏకంగా ఏడో గ్యారంటీగా పౌర హక్కులను వాగ్దానం చేసిన కాంగ్రెస్..ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టాలని చూడటం అంటే కాంగ్రెస్‌ పాలన ఎప్పటికీ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన అనుకోవాలి. రాజ్యాంగ పరిరక్షణ పాలన కాదు..రాజ్యాంగ వ్యతిరేక పాలనే అవుతుంది.
ప్రభుత్వం తాజా ఆదేశాలతో  నేరాస్తులన్న అనుమానంతో సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి శాశ్వత మృత్యు ఘంటిక.ఇది పోలీసుకు అపరమిత అధికారాలు కట్టబెట్టుతుంది. సోషల్ నేరస్తులన్న ముద్ర వేసి సర్కార్‌ వైఫల్యాలను నిలదీస్తున్న  వారి గొంతు నొక్కేందుకు పోలీసులు , అధికార పార్టీ ఆయుధంగా మార్చుకునే ప్రమాదముంది.  సోషల్ మీడియా పోస్టులపై  ఏకంగా రౌడీ షీట్ తెరిచే  అధికారాన్ని ప్రభుత్వం పోలీసులకు ఇస్తుంది. ఎవరినైనా వేధించడానికి, ఎవరి ఇళ్లలోకైనా అక్రమంగా  ప్రవేశించడానికి, వారి ఇష్టానుసారంగా అరెస్టు చేయడానికి పోలీసులకు కొత్త జీఓ  విస్తృతాధికారాలు కల్పించింది.
ఇటీవలే సోషల్ మీడియా పోస్ట్‌లపై కేసులు నమోదు చేయడంపై సుప్రీం, హైకోర్ట్‌లు ప్రభుత్వాలను మందలించాయి. ప్రభుత్వాన్నిప్రశ్నిస్తే కేసులు పెట్టవద్దని హెచ్చరించాయి. అయితే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు, అందులో యాక్టివ్‌గా ఉన్న వారిని ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర పూరితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం  తెరపైకి  కొత్త జీఓ  తీసుకువచ్చింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అనుమానం పేరుతో  రౌడీషీట్స్‌ ఓపెన్‌ చేసి, అరెస్టు చేసి, బెయిల్ కూడా రాకుండా  కుట్రలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మాములు కేసుల్లో అయితే బెయిల్ ఈజీగా వస్తుంది, అదే పీడీ యాక్ట్‌, రౌడీషీట్స్‌లో అయితే  చట్టపరమైన నిబంధనలతో బెయిల్ కష్టమవుతుంది. కనీసం  ఈ విధంగా అయిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కవచ్చన్న ఉద్దేశ్యంలో సర్కార్ ఉన్నట్లుంది..ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన ,ప్రజా వ్యతిరేక నిర్ణయమే అవుతుంది.
ఒకవైపు దేశంలో నియంతృత్వం పెరుగుతుందని, బీజేపీ  నియంతపాలన చేస్తూ నయా హిట్లర్‌లా మారి ప్రజలను ప్రజాస్వామ్యాన్ని అణివేస్తు రాజ్యాంగాన్ని రద్దే చేసే కుట్రలు చేస్తుందంటూ కాంగ్రెస్‌ సీనియన్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగతున్నారు. జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌  ప్రభుత్వం, రాహుల్‌ గాంధీ ఆలోచన విధానాలకు విరుద్దంగా సోషల్‌ మీడియాపై నిఘా పెడుతూ ,  సర్కార్ ను ప్రశ్నిస్తున్న జెన్‌జీలపై కేసులు పెట్టాలనుకోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
నిజంగా కాంగ్రెస్‌ది ప్రజా పాలన అయితే ప్రజా విమర్శలను ఏరకంగా వస్తున్న స్వాగతించాలి. రేవంత్ రెడ్డిది ప్రజాస్వామ్య పాలనే అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి.  రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశ్యమే ఉంటే జెన్‌ జీ ప్రశ్నలను సానుకూలంగా స్వీకరించాలి. అలా కాకుండా కేసులు పెట్టి వేధిస్తాం. పీడీ యాక్ట్‌లు పెట్టి హింసిస్తామంటే ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై రౌడీషీట్స్‌ తెరిచి అణిచివేస్తామని ప్రభుత్వం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అణిచివేత ఎంత బలంగా ఉంటే ప్రజా  తిరుగుబాటు అంత బలంగా ఉంటుంది.. అందులో జెన్‌జీల విషయంలో ప్రభుత్వం మరింత ఆచీతూచీ వ్యవహరించాలి.
అధికారం ఉందని, పోలీసు వ్యవస్థ తన గుప్పిట్లో ఉంది కదా అని జెన్ జీలను  అణిచివేయాలని చూస్తే ఏం జరుగుతుందో మనకు పక్కనే ఉన్న  నేపాల్‌, బంగ్లాదేశ్‌ , శ్రీలంక దేశాల అనుభవాలు కళ్లముందే ఉన్నాయని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మరిచిపోవద్దు. ఒకవైపు దేశంలో బీజేపీ వోట్‌ చోరికీ పాల్పడుతుందని, విచారణ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని విపక్షాలను మోదీ  షాలు వేధిస్తున్నారని, నేపాల్‌ తరహాలోనే ఇండియాలో కూడా యువత చైనత్యం కావాలని, జెన్‌జీ ఉద్యమాలు రావాలని రాహుల్ గాంధీ యువతకు పిలుపు నిస్తుంటే..మరోవైపు సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ను వైఫల్యాలను నిలదీస్తున్న  వారిపై కేసులు పెట్టే ఆదేశాలు ఇవ్వడం అంటే కోరికోరి  నిప్పులో చెలగాటం ఆడటమే అవుతుంది. కాంగ్రెస్ నియంతృత్వ పోకడాలు ఇలాగే కొనసాగితే దేశంలో  రాహుల్ కోరుకుంటున్న  జెన్‌ జీ ఉద్యమం తెలంగాణ నుంచే మొదలైతుందని రేవంత్‌ రెడ్డి గ్రహించాలి.
రాష్ట్రంలో  ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.  విద్యార్థులు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి  కార్యకర్తలు, కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు, పెంచనర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టడం. ప్రశ్నిస్తున్న వారిపై రౌడీషీట్స్  ఓపెన్‌ చేయాలన్న ఆలోచనలు ప్రభుత్వం చేయడం అగ్గికి ఆజ్యం పోయడమే అవుతుంది. జెన్‌ జీలను రెచ్చగొట్టడమే అవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఆలోచనను వెనక్కి తీసుకోకపోతే  తెలంగాణలో కూడా నేపాల్ తరహాలో జెన్ జీ తిరుగుబాటు వస్తుంది..అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి..ఇప్పుడు రేవంత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అగ్గి ఆజ్యం పోసినట్లు అవుతుంది. ప్రజలను ఒప్పించి మెప్పించి పాలన చేయాలి కానీ అణివేత, నిర్బంధాలతో పాలన చేస్తామంటే ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాధించలేవు.
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *