కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌పాటిల్‌ కన్నుమూత

– ఎమ్మెల్యేగా, ఎంపీగా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ స్పీకర్‌గా సేవలు
– సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు

ముంబై, డిసెంబర్‌ 12: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌ పాటిల్‌ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌ పాటిల్‌ లాతూర్‌ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1935లో జన్మించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ చీఫ్‌గా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1991 నుంచి 1996 వరకు లోక్‌సభలో 10వ స్పీకర్‌గా ఉన్నారు. 2004I2008 వరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. పంజాబ్‌ గవర్నర్‌గా, చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మిస్ట్రేటర్‌గా కూడా సేవలందించారు. పలు కీలక కీలక బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్‌ పాటిల్‌ మరణం తనను కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఎక్స్‌ వేదికగా ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ‘శివరాజ్‌ పాటిల్‌జీ మరణం విచారకరం. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలంపాటు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి సహా అనేక హోదాల్లో సేవలందించారని తెలిపారు. సమాజ సంక్షేమానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవరని, కొన్ని నెలల క్రితమే ఆయన తన నివాసానికి వచ్చారని, ఇంతలోనే ఇలా జరగడం విచారకరం.. ఓం శాంతి అని మోదీ రాసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా శివరాజ్‌ పాటిల్‌ మృతికి సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలంపాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శివరాజ్‌పాటిల్‌ మృతికి సంతాపం తెలిపారు. పాటిల్‌తో సన్నిహిత సంబంధం ఉందని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. గొప్ప గౌరవప్రదమైన, రాజనీతిజ్ఞుడైన పాటిల్‌ కీలకమైన రాజ్యాంగ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన సమగ్రత, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ఆరాధించిన వారందరికీ తీరని లోటన్నారు. కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా పాటిల్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పాటిల్‌ మరణం చాలా హృదయవిదారకమైనదన్నారు. పార్టీకి పూడ్చలేని నష్టమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, దేశానికి ఆయన చేసి కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని రాహుల్‌ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *