– ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? : మెక్సికో అధ్యక్షురాలు
న్యూదిల్లీ, నవంబర్ 6: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్‌బామ్ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు గురయ్యారు. అధ్యక్ష భవనం సమీపంలో మిచొకాన్‌లో మంగళవారం పౌరులతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దేశ అధ్యక్షురాలు నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారు. ఆ వ్యక్తి ఇతర మహిళలను కూడా వేధించాడని తరువాత తెలుసుకున్నారు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె కేసు పెట్టారు. ఈ ఘటనపై క్లాడియా స్పందించారు. ఈ ఘటన మెక్సికోలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. పురుషాధిక్యత, లైంగిక వేధింపులతో దేశంలోని మహిళలు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు దేశ అధ్యక్షురాలినైన నాకే ఇలా జరిగితే దేశంలోని యువతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మహిళల వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదని క్లాడియా పేర్కొన్నారు. కానీ అధ్యక్షురాలికి అలాంటి ప్రవర్తన ఎదురవడం దేశంలోని అందరు మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఇది ఎత్తి చూపుతోందని షీన్‌బామ్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





