మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ

– అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి
– దివ్యాంగుల మధ్య సంక్రాంతి సంబరాలు

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 8: మానసిక దివ్యాంగ పిల్లలకు అందరు పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు, పిల్లలకు భోగి పండ్లు పోస్తుంటే చాలా ఆనంద పడ్డారన్నారు. హన్మకొండలోని వికాస్‌ మానసిక దివ్యాంగుల పాఠశాలలో నిర్వాహకురాలు విశాలి అధ్యక్షతన నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత పిల్లలకు భోగి పండ్లు పోశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అనితా రెడ్డి మాట్లాడుతూ కల్మషం ఎరుగని మానసిక దివ్యాంగుల మధ్య సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం సంతోషంగా ఉందంటూ వారికి ఆనందాన్ని అందించడం కంటే సంతోషం ఏదీ ఉండదని అన్నారు. దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని అన్నారు. పిల్లలు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలంటూ మానసిక దివ్యాంగుల పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ వారి సేవకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. మానసిక దివ్యాంగుల సేవ చేస్తున్న వికాస్‌ నిర్వాహకులను, సిబ్బందిని అభినందించారు వారికి ఏ సహాయసహకారాలు కావాలన్నా చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. పిల్లలకు స్వీట్స్‌, స్నాక్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి.యు ప్రవీణ్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, కమ్యూనిటీి ఎడ్యుకేటర్‌ తేజస్విని, టీచర్స్‌, సిబ్బంది పాల్గొన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *