డే కేర్‌ సెంటర్‌తో వృద్ధులకు ప్రయోజనాలు

– పరకాల ఆర్డీవోతో కలిసి సెంటర్‌ను పరిశీలించిన అనితారెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: సీనియర్‌ సిటిజన్స్‌కు చక్కని ఆటవిడుపు డే కేర్‌ సెంటర్‌ అని, ఇందులోని లైబ్రరీ, ఆట వస్తువులు వినియోగించుకుంటే ఒంటరితనం దూరం అవుతుందని సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డి అన్నారు. పరకాల ఆర్డీవో డాక్టర్‌ నారాయణ, డాక్టర్‌ అనితా రెడ్డిలు హన్మకొండ జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణలోని సీనియర్‌ సిటిజన్స్‌ డే కేర్‌ సెంటర్‌ను మంగళవారం సందర్శించారు. అందులో వయో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ క్లినిక్‌, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ఎలా నడుస్తున్నాయో పరిశీలించారు. వృద్ధులకు సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు వరం అని ఆమె అన్నారు. ఎన్ని కేసులు వచ్చాయి, సలహాలు, సూచనల కోసం ఎంతమంది వచ్చారు, కౌన్సెలింగ్‌కు ఎంతమంది వచ్చారు అన్న వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని ట్రిబ్యునల్‌ కోర్టుకు వస్తున్న కేసులు, కోర్టు పని చేస్తున్న తీరును డాక్టర్‌ అనితా రెడ్డి ఆర్డీవోకు వివరించారు. ఇకముందు కూడా సీనియర్‌ సిటిజన్స్‌ కోసం మరింతగా పనిచేయాల్సిన విషయాల గురించి చర్చించారు. సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ద్వారా వృద్దులకు మరిన్ని సేవలు అందిద్దామని, సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంపై అవగాహన కార్యక్రమాలు గ్రామస్ధాయి నుండి జిల్లాస్థాయి వరకు నిర్వహిద్దామని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వయోవృద్దుల కోసం పని చేద్దామని చెప్పారు, ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఉష, వాణి, సీనియర్‌ సిటిజన్స్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *