వైద్యుల సెలక్షన్‌ లిస్టు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఎన్‌జే హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సెలక్షన్‌ లిస్టును మెడికల్‌ రికూట్ర్‌మెంట్‌ బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు శనివారం ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీతో ఆయుష్‌ వైద్య సేవలు మరింత మెరుగవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుష్‌ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి గుర్తు చేశారు. ఆయుష్‌లో ఇటీవలే 630 వరకు యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించామని, మరో 200కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. కేన్సర్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేన్సర్‌ వైద్య సేవలను విస్తరిస్తున్నామని, కొత్తగా 45 మంది డాక్టర్ల నియామకంతో ఎంఎన్‌జే కేన్సర్‌ హాస్పిటల్‌లో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని చెప్పారు. జిల్లాలకు కూడా ప్రభుత్వ కేన్సర్‌ వైద్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వివరించారు. ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తే పేషెంట్లు హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం ఉండదని, జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి రాజనరసింహ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *