– వీటి మంజూరు నిరంతర ప్రక్రియ
– వచ్చే మూడేళ్లలో పట్టణాల్లో ప్రతి వార్డులో ..
– శాసన మండలిలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబధాల శాUల మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మాయమాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందని అన్నారు. రాబోయే మూడేళ్లలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం హౌసింగ్‌పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు జరగగా మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామని చెప్పారు. మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామపి, .లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష ఉండదని, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయని, జూన్-జూలై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నామని వివరించారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా, 2బీహెచ్‌కే పథకంలో పెండింగ్ బిల్లులలో 99% ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. వివిధ దశల్లో ఆగిపోయిన ఈ ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్త్తున్నదన్నారు.
త్వరలో డిజిటల్ మీడియా పాలసీ
వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో బుధవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయములో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కొంతమంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు.. అర్హులైన జర్నలిస్టులందరికీ ఆ కార్డులు జారీ చేస్తాం. ఎలాంటి భేñషజాలాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీవోపై అన్ని జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని మార్పులుచేర్పులు చేశామన్నారు. డెస్క్ జర్నలిస్టులు, మరో జర్నలిస్టులనే తేడా తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికేì ఈ విషయములో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారని, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




