ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్స్ వేదికగా దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎందరో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, వివిధ తరగతుల్లో మొత్తం 3.68 లక్షల మంది చేరారని తెలిపారు. ఈమేరకు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను తన పోస్టుకు జతచేశారు. ’పదేళ్ల చీకట్లను పారదోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి.. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోచ్ఛారణలతో పవిత్రతను సంతరించుకున్నాయి.. పాఠశాలల్లో కనిపిస్తున్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతం.. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనం.. ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అంటూ పోస్టు చేశారు.



