‘సంశోధిని’ వాల్‌ ఆర్ట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సింపోజియం ఆవిష్కరణ

వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: కిట్స్‌ వరంగల్‌లో సంశోధిని-25 సాంకేతిక ఉత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అండ్‌ మీడియా క్లబ్‌ (పీఎమ్‌సీ), స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (సాక్‌), కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌ డబ్ల్యు) వాల్‌ ఆర్ట్‌ను డిజైన్‌ చేసి పెయింట్‌ చేశారు. దీన్ని కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి డీన్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ ఎం,శ్రీలత, విద్యార్థి ప్రతినిధులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోమల్‌ రెడ్డి మాట్లాడుతూ ఊహ నుంచి ఆవిష్కరణ అనే ఇతివృత్తానికి సంబంధించి విభిన్న కళాకృతులు కలిగి ఉన్న వాల్‌ ఆర్ట్‌ ఆవిష్కరణ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనిని ఫొటోగ్రఫీ, మీడియా క్లబ్‌ విద్యార్థులు రూపొందించారన్నారు. కార్యక్రమంలో డీన్‌లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.వేణుమాధవ్‌, డీన్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ అండ్‌ ప్రోగ్రాం కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీలత, పీఆర్వో డాక్టరు డి.ప్రభాకరాచారి, ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టరు టి.మధుకర్‌ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్‌ డాక్టర్‌ ఎస్‌.సునీల్‌ ప్రతాప్‌ రెడ్డి, డాక్టరు బి.విజయ్‌ కుమార్‌, విద్యార్థి ప్రతినిధులు, పీఎంసీ విద్యార్థి అధ్యక్షుడు జి.సాయి సుమంత్‌, ఉపాధ్యక్షుడు, ఎం.ఫణిమాధవ్‌, చరణ్‌సాయి, సాయిసాత్విక్‌, ఉమా మహేష్‌ రెడ్డి, సాయి ప్రభాస్‌, విఘ్నేష్‌, సోహెల్‌ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐఎస్‌టీఈ కిట్స్‌ విద్యార్థి చాప్టర్‌ ప్రెసిడెంట్‌ వై.నాగతరుణ్‌, టెక్నికల్‌ క్లబ్‌ విద్యార్థి అధ్యక్షుడు కె.శశికాంత్‌, వందమంది పైన విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *