– కొన్ని రాష్ట్రాల్లో పొడిగించిన ఎన్నికల సంఘం
న్యూదిల్లీ, డిసెంబర్ 11: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా అప్‌డేట్ ఇచ్చింది. వీటిలో తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ సహా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ గడువును పొడిగించింది. పశ్చిమబెంగాల్, రాజస్థాన్, లక్షద్వీప్, గోవాల్లో మాత్రం ఈ గడువు గురువారంతో ముగిసింది. తమిళనాడు, గుజరాత్‌లలో డిసెంబర్ 14వరకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు డిసెంబర్ 18వరకు, ఉత్తర్ ప్రదేశ్‌లో డిసెంబర్ 26 వరకు గడువు పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటికి అనుగుణంగా సవరణ జాబితా ప్రచురణ తేదీలు కూడా మార్చినట్లు తెలిపింది. వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ’సర్’ గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రెండో దశ కింద ఈసీ మొత్తం 12 రాష్ట్రాల్లో, యూటీల్లో ‘సర్’ పక్రియ చేపట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 11లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్‌లలో ఈ గడువు ముగిసింది. ఈ నాలుగు రాష్ట్రాల ముసాయిదా వోటర్ల జాబితా డిసెంబర్ 16 ప్రచురించనున్నట్టు ఈసీ తెలిపింది. 2026లో పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో ‘సర్’ గడువు పొడిగిస్తారని అంతా భావించారు. కానీ, ఈసీ ఆ అవకాశం లేకుండా చేసింది. తాజా పొడిగింపునకు ముందు ఈసీ కేరళ షెడ్యూల్‌ను సవరించింది. డిసెంబర్ 18 వరకూ గడువు నిర్దేశించింది. ఈనెల 23న ముసాయిదా వోటర్ల జాబితా ప్రచురిస్తామని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



