రోశయ్య విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన వివిధ హోదాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *