బీజేపీ నేత రాములు ఇంటివద్ద రోహింగ్యాల రెక్కీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ ఇంటి ముందు రోహింగ్యాలు శుక్రవారం రెక్కీ నిర్వహించారు. ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారు పెట్రోల్‌ బాటిల్‌, సుత్తి, కట్టర్‌, ఐరన్‌ రాడ్లు బాక్స్‌లో పెట్టుకుని తిరుగుతున్నట్లు గమనించారు. కొన్ని రోజులుగా రోహింగ్యాలపై శ్రీరాములు యాదవ్‌ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రాణహాని ఉందని బిబీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రోహింగ్యాలను పట్టుకోవడానికి ప్రయత్నించగా వాహనం వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులను గుర్తించి మీం పేట పోలీస్‌ స్టేషన్‌కు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు. కాగా, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *