నెల రోజులపాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు

– పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం 

‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్రంలో నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు- 2026 కొనసాగుతాయని రోడ్డు రవాణా శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు.యాదగిరి గుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు  2026 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు రోడ్డు భద్రత మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి దగ్గర, వారి తల్లిదండ్రుల నుండి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామనే హా పత్రం తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాల రోడ్‌ ‌సేప్టీ క్లబ్‌లో చేరాలని సూచించారు. భవిష్యత్‌ అం‌తా రోడ్‌ ‌సేప్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రయత్నం జరుగుతుందని వివరించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ అధికారులు విడుదల చేసిన నివేదికల్లో అనేక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని, అందరూ ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటించాలని రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ‌బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *