అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు 15 మంది మృతి – గాయపడిన వారిని భద్రాచలం హాస్పిటల్ తరలింపు.
భద్రాచలం/ చింతూరు , ప్రజాతంత్ర,, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మీదుగా అన్నవరం దర్శనం కోసం వెళుతున్న బస్సు అదుపుతప్పి మారేడుమిల్లి లైవ్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 37 మంది ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వైద్యం కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.





