– మైనస్ 20 డిగ్రీల చలిలోనూ కొనసాగిన తరగతులు
– వివిధ దేశాల్లోని పాలనాపరమైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చ
– తోటి ప్రతినిధులతో కలిసి బృంద చర్చలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కె చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) హాజరయ్యారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాల తో పాటు ’21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సులో భాగంగా “అధికార విశ్లేషణ.. నాయ కత్వం” అంశంపై తొలి సెషన్ ప్రారంభమైం ది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. సోమవారం సాయం త్రం ఆరు గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం…) తరగతులు కొనసాగనున్నాయి. మరోవైపు బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొ న్నాయి. భారీ మంచు తుఫాను (ఫెర్న్) కారణంగా రెండు అడుగులకుపైగా (సుమారు 24 ఇంచులు) మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియసికి దిగువకు పడిపోయాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





