పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ చర్యలే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. శ్రీ రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఇప్పటికి రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంత తక్కువ సమయంలోనే ఆయన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పాలనలో వేగం, పారదర్శకత, ప్రజల సమస్యలపై స్పందన వంటి అంశాల్లో శ్రీ  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుకున్నదానికంటే ముందంజలో ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది. శ్రీ కేసీఆర్  మొదటి రెండేళ్ల పాలనతో పోల్చి చూస్తే, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.  

ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి   కేసీఆర్  శక్తిమంతుడిగా, ఎవ్వరూ ఓడించలేని నాయకుడిగా భావించేవారు.కానీ 2023 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓడించి అధికారంలోకి వచ్చింది.ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు.తెలంగాణ రాజకీయాల్లో 2023 ఎన్నికలు ఒక స్పష్టమైన మార్పును తీసుకొచ్చాయి.ప్రజలు వ్యక్తి ఆధిపత్యానికి కాకుండా, ప్రజాస్వామ్య పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయం ఆ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.  ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి   బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కొత్త నమ్మకాన్ని కలిగించాయి.రేవంత్ రెడ్డి  ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తొలి నిర్ణయం—గత ముఖ్యమంత్రి అధికార కేంద్రంగా ఉపయోగించిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చడం.ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ఇది ప్రజా ప్రభుత్వం అన్న సంకేతాన్ని నేరుగా ప్రజలకు పంపింది.ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు ఇది ఆరంభంగా మారింది.కాళోజీ అన్నట్టు “ద్రోహం చేసినవాడు పరాయివాడైతే తరిమికొట్టు ఇక్కడ వాడైతే పాతిపెట్టు” అన్న మాటను అక్షరాలా నిజం చేసింది రేవంత్ రెడ్డి నాయకత్వం.

ఏ రాష్ట్ర అభివృద్ధికైనా విద్య మరియు ఉద్యోగాలు ప్రధాన పునాదులు. ప్రజలకు నాణ్యమైన విద్య అందించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రభుత్వం విద్య, ఉద్యోగాల విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోంది.ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యా శాఖను తన వద్దనే ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రశంసనీయమైన విషయం.పాఠశాల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు. ఈ ఏడాది బడులు ప్రారంభం కాకముందే పాఠ్యపుస్తకాలు స్కూళ్లకు చేరేలా చర్యలు తీసుకోవడం హర్షించదగిన విషయం. ఇది ప్రభుత్వ ప్రణాళికాబద్ధతను, విద్యపై చూపుతున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటు చేశారు.అంతే కాకుండా ఎస్సెస్సీ, ఇంటర్‌ని బోర్డులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు.పైలట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం, రంగారెడ్డి జిల్లా మంచాల మండలాలను తీసుకొని పాఠాశాలలను విలీనం చేసే ప్రక్రియ మొదలు పెట్టినారు.ఈ రెండు మండలాలు విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.నర్సరీని స్కూళ్లల్లో ప్రవేశపెట్టడానికి అధికారులు పరిశీలిస్తున్నారు.పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా టీచర్ కొలువులు భర్తీ చేయబడ్డాయి.
కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసి, వ్రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో గ్రూప్–1 పరీక్షలు నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కాంగ్రేస్ ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌నే తొలి గ్రూప్–1 నోటిఫికేషన్‌గా నిలిచింది. అంతకుముందు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదన్న విషయం తెలుసుకుని కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్యోగాల నియామకాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తూ, ఎలాంటి అవకతవకలు జరగకుండా నియామకాలను పూర్తి చేసింది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కూడా ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదు.రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేసి, హామీలు మాటలకే పరిమితం కావని నిరూపించింది. కొత్త రేషన్ కార్డులు, పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు 500 రూపాయల బోనస్.. ఇలాంటివి ప్రజల మనసుని చూరగొనే విషయాలు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్‌, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవడం సంక్షేమ పాలనకు నిదర్శనం. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కేవలం తొమ్మిది నెలల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయడం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఇదే గత ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు తీసుకుంది.ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌గా నిధులు ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటించడం.. సర్పంచులకు ఎంతో ఊరటనిచ్చే విషయం.ప్రభుత్వం హైడ్రా యేర్పాటు చేసి, కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టింది.హైడ్రా వల్లనే భతుకమ్మ కుంట పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న గద్దర్, అందెశ్రీ ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్, అందెశ్రీ లకు పెద్దపీట వేసింది. గద్దర్ పేరున అవార్డు ప్రకటించింది. ఆయన కూతురికి సాంస్కృతికి సారథి ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చి గౌరవించింది.అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది.అందెశ్రీ చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్వయంగా పాడె మోసి అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొమ్మిది మంది ఉద్యమకారులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు ప్రకటించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో స్వయంగా నగదు బహుమతులను ప్రదానం చేశారు.

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ చర్యలే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. శ్రీ రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఇప్పటికి రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంత తక్కువ సమయంలోనే ఆయన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పాలనలో వేగం, పారదర్శకత, ప్రజల సమస్యలపై స్పందన వంటి అంశాల్లో శ్రీ  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుకున్నదానికంటే ముందంజలో ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది. శ్రీ కేసీఆర్  మొదటి రెండేళ్ల పాలనతో పోల్చి చూస్తే, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

2023 తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో విజయం సాధించింది. ఈ విజయాలు స్థానిక రాజకీయాల్లో పార్టీ స్థిరత్వానికి, ప్రజల నమ్మకానికి గీటురాయిగా నిలిచాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరిచాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దాదాపు 66% స్థానాలను గెలుచుకుంది. తొక్కిపెట్టో.. నయాన్నో భయాన్నో బెదిరించో పంచాయతీ ఎన్నికలు నెరపలేదు. ప్రశ్నించే హక్కుని కాపాడారు. ప్రతిపక్షానికి తావిచ్చారు. నెంబర్‌ కోసమో, రికార్డు కోసమో చూడలేదు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన ఎన్నికలవి. స్థానిక పాలనలో ప్రజల ఆకాంక్షను గౌరవించిన ఎన్నికలవి. పార్టీ అలా వ్యవహరించింది కనుకే ప్రతిపక్ష పార్టీలు మిగతా స్థానాలు గెలుచుకోగలిగాయి. నిరంకుశంగానో, నియంతృత్వంగానో వ్యవహరించాలని చూడలేదు. అలా చేసి చేయి కాల్చుకున్న గత సర్కారుని రేవంత్ రెడ్డి మరిచిపోరు. కేసీఆర్ చేసిన తప్పు ఆయన చేయాలనుకోలేదు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ, నిధుల వినియోగం, విధి విధానాలు అమలు పరంగా ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తోంది.ఇది ప్రభుత్వ ప్రతిపాదనలు,కార్యాచరణ, ప్రజల అవసరాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక సానుకూల పరిణామం. ఇకపోతే ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తోంది.విధాన నిర్ణయాలు, ఎన్నికల ప్రక్రియలు, స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం స్పష్టంగా ఉంది.ఇది ప్రజలలో ప్రభుత్వపై నమ్మకాన్ని పెంచటంలో ముఖ్య పాత్ర పోషిస్తోందనడంలో సందేహం లేదు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి  నాయకత్వానికి ప్రజల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. 2029 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉండాలని మెజారిటి ప్రజలు కోరుకుంటున్నారు.మొత్తంగా, తెలంగాణ రాజకీయాలు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టాయి.పాలన, అభివృద్ధి, నిజాయితీపై ఆధారపడి ప్రజలు తీర్పు ఇస్తున్నారని ఈ మార్పులు స్పష్టంగా చూపిస్తున్నాయి.

ప్రజలే కేంద్రంగా రాజకీయాలు చేసిన నాయకులెవ్వరూ ఓడిపోరు. ప్రజల పక్షాన్నే నిలిచిన నాయకులకు ఓటమి లేదు. సిస్టం ని మార్చాలంటే ధైర్యం కావాలి. తెగువ కావాలి. అంకితభావం కావాలి. ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ప్రజలు అడిగితే సమాధానం ఇచ్చేంత దమ్మున్న నేత ఆయన. ప్రజలకు ప్రశ్నించే హక్కుని కల్పించిన నేత ఆయన. అధికారం కాదు బాధ్యత ముఖ్యమని కొత్త భాష్యం చెప్పిన లీడర్. రేవంత్ రెడ్డి రైతు బిడ్డ. నాగలి పట్టి, దుక్కి దున్నిన నాయకుడు. రైతు బిడ్డ రైతుల సంక్షేమం కోసం పని చేస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.మన్నుగప్పాలని చూస్తే గన్నులై మొలకెత్తుతుంది.గొంతు నొక్కాలని చూస్తే పిడుగై గర్జిస్తుంది.రేవంత్ రెడ్డి ని రెండు సార్లు జైలుకు పంపినా  బెదరకుండా,  ఒంటరి పోరాటం చేస్తూ కలబడి నిలబడ్డాడు.ప్రజలు అధికారం ఇచ్చింది శత్రువు మీద పగతీర్చుకోవడానికి కాదని.. శత్రువు సైతం సాహో అనేలా పాలన చేయడానికి ఇచ్చారని ప్రతీ దశలోనూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఒక నేల గౌరవాన్ని కాపాడే రాజకీయం చేస్తున్న అతికొద్ది మంది రాజకీయనేతల్లో రేవంత్ రెడ్డి ఒకరని చెప్పడంలో ఇసుమంత కూడా సందేహం లేదు.రేవంత్ రెడ్డి కి తెలంగాణ గడ్డపై మరే నాయకుడికీ లేనంత ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ నుంచి అమెరికా దాకా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకుంటూ, ప్రజల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
–పోచంపల్లి తిరుపతిరెడ్డి(ఎన్.ఆర్.ఐ),
పరకాల నియోజకవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *