- పార్టీలకతతీంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో వోటేద్దాం
- రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం
- తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్ రెడ్డి వినతి
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయలేదని, ఇండియా కూటమి అభ్యర్థిగా మాత్రమే ఎంపిక చేశారని అన్నారు. పీవీని నంద్యాల నుంచి ఎన్నుకునే సమయంలో ఆనాడు ఎన్టీఆర్ ఏకగ్రీవ ఎన్నికకు పిలుపునిచ్చారని, ఆయన స్ఫూర్తితో మనమంతా తెలుగువాడైన సుదర్వన్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను ఎన్డీయే అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒక వైపు.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరో వైపు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలి. తెదేపా, వైకాపా, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం సహా అన్ని పార్టీలు.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు (Vice President Election) తెలపాఅని అన్నారు..
చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. ఆనాడు ప్రధాని పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలందించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణ ప్రజలకు గర్వ కారణమని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఒవైసీ ఒకే మాటపై నిలబడి పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా.. రాజ్యాంగ నిపుణుడిగా సుదర్శన్ రెడ్డికి పేరు ఉందని అన్నారు.జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఇండియా కూటమికి తెలంగాణ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఒకతాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





