– ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలపై సమీక్ష
– అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. విద్య, విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని, అందుకనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి సూచనలు చేశారు. టీం వర్క్‌తో, సమన్వయంతో పనిచేయాలని, విమర్శలకు తావివ్వకూడదన్నారు. పెండిరగ్ సమస్యల పరిష్కార బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. అన్ని వెల్ఫేర్ సొసైటీలు, శాఖలు ఒక సమగ్ర విధానాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, బోధన, వసతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హెచ్చరించారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు లేకుండా సమగ్ర వ్యూహాలతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల మధ్య సమన్వయం మరింత బలపడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి అధికారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు, గురుకులాల ప్రతిష్టపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి విద్యార్థి జాతీయ స్థాయిలో పేరు సంపాదించేలా గురుకులాల్లో నాణ్యమైన బోధన అందించాలని ఆదేశించారు .రాష్ట్రం విద్యా రంగంలో ముందంజలో ఉండేలా ప్రతి గురుకులం రోల్ మోడల్ కావాలని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో ఎస్సీ గురుకుల కార్యదర్శి కృష్ణ ఆదిత్య, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయుల్ల్లా, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





