ఏఐ- ఆధారిత సైబర్ భద్రతపై ప‌రిశోధ‌న‌లు జ‌రగాలి

కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 20 :   ఏఐ- ఆధారిత సైబర్ భద్రతా (AI-based Cyber Security) పరిష్కారాలలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల‌ని కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు. కిట్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగం ఆధ్వ‌ర్యంలో  ” ఎఐ -ఆధారిత సైబర్ సెక్యూరిటీ: డిజిటల్ ఎరా కోసం రక్షణ వ్యూహాలు” అనే అంశంపై  ఏఐసీటీఈ -అటల్ ‌‌– వన్ వీక్ ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్ డిపి)ని నిర్వహిస్తోంది. ఇది ఈనెల 18 నుంచి 23 వరకు కొనసాగుతోంది. సాంప్రదాయ సైబర్ సెక్యూరిటీ విధానాలు, ఆధునిక ఏఐ ఆధారిత రక్షణ విధానాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి అధ్యాపకుల బోధనా పద్ధతులు, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం  అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) ఎఫ్డిపిని అతిథి  కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, డీన్ ఆర్ & డి డాక్టర్ వీరారెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అశోక రెడ్డి సాంకేతిక  అధ్యాపక పార్టిసిపెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చురుకైన సైబర్ రక్షణలో కృత్రిమ మేధస్సు పాత్రలో బోధనా నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేయడం, సైబర్ బెదిరింపులను గుర్తించడం, నిరోధించడం, ప్రతిస్పందించడం కోసం ఎఐ/ఎంఎల్ సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, జాతీయ సైబర్ భద్రతా వ్యూహాలతో అనుసంధానించబడిన ఏఐ- ఆధారిత సైబర్ భద్రతా పరిష్కారాలలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి అంశాలను హైలైట్ చేశారు.
సిఎస్ఎన్ విభాగం ప్రొఫెసర్, అధిపతి డాక్టర్ వి.శంకర్ ప్రకారం, విద్యార్థులు పోటీ పరీక్షలు, పరిశ్రమ-ప్రామాణిక ధృవపత్రాలు, రియ‌ల్ వ‌ర‌ల్డ్‌ ప్రోగ్రామింగ్ సవాళ్లలో రాణించడానికి ఈ విధానం చాలా కీలకమ‌ని అన్నారు. విద్యార్థులు వారి విద్య, వృత్తిపరమైన వృద్ధికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడంలో ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిపి కోఆర్డినేటర్  సి ఎస్ఎన్  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. వెంకట్రాములు మాట్లాడుతూ ఎఫ్ డిపి ఫలితం మాల్వేర్ గుర్తింపు కోసం  ఎఐ – ఆధారిత నమూనాలను రూపొందించడం, పరీక్షించడం కోసం యంత్ర అభ్యాస పద్ధతులను వర్తింపజేయడమ‌ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల  డీన్స్, విభాగాధిపతులు, కోఆర్డినేటర్లు,  సిఎస్ఎన్‌  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. వెంకట్రాములు, సిఎస్ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.రమేష్, అధ్యాపకులు,  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.చంద్ర శేఖర్ రావు,  142 మంది అధ్యాపక పార్టిసిపెంట్స్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్‌ఓ, డా. డి.ప్రభాకరా చారి,  సిబ్బంది  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *