– సీఎంతో ఎన్టీపీసీ బృందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: సోలార్, విండ్ విద్యుత్(solar, wind power) ప్రాజెక్టుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ (NTPC CMD)గురుదీప్ సింగ్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఈ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు ఈ బృందం తెలిపింది. ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపింది. ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బృందానికి స్పష్టం చేశారు.




