ఐఏఎస్‌ ఆమ్రపాలి కాటకు ఊరట

తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24 :  తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు.  పిటిషన్‌ను అనుమతించిన క్యాట్‌.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *