– చైనా చమురు నౌకలకు ఇరాన్ అనుమతి
టెహ్రాన్, మార్చి 4: ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైన, పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన దాడులు చేస్తున్నది. ఈ దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్.. ఇంధన సరఫరాలో ప్రపంచ జీవనాడి అయిన హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఆ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించే చమురు నౌకలను పేల్చివేస్తామని హెచ్చరికలు కూడా చేసింది. కొన్ని నౌకలపై దాడులు కూడా చేసింది. దాంతో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణ అనుమతి కోసం భారీ సంఖ్యలో చమురు నౌకలు వేచి ఉన్నాయి. ఈ క్రమంలో చైనా చమురు నౌకలకు మాత్రం జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా.. ఇరాన్‌పట్ల సానుభూతి చూపుతుండటంతో అందుకు ప్రతిఫలంగా ఇరాన్ చైనా నౌకలకు అనుమతి ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచ దేశాల నడుమ చమురు సరఫరాకు హార్ముజ్ జలసంధి కీలకం. ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్ తీరాలను ఓపెన్ సముద్రంతో కలిపే కీలక చోక్ పాయింట్. ఈ జలసంధిని మూసివేయడం వల్ల గ్లోబల్ సప్లయ్ చైన్‌కు విఘాతం కలుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





