– సీఎంను కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఘన- తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని హైకమిషనర్ డాన్సో కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





