రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయం తరలింపు కుదరదు

– మంత్రులతో మాట్లాడే వరకు నిర్ణయం తీసుకోవద్దు
– అధికారులను హెచ్చరించిన కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 27: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తే ఊరుకోనని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా, పట్టణ సబ్‌ ‌రిజిస్ట్రా ‌కార్యాలయాలను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ ‌రిజిస్టేష్రన్‌ ‌కార్యాలయం పేరుతో పటాన్‌చెరులోని కర్ధనూర్‌కు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో తాను మాట్లాడేవరకు తరలింపు ఆలోచన చేయొద్దన్నారు. రిజిస్టేష్రన్‌ ‌శాఖ అధికారులకు ఇది తన సూచన.. హెచ్చరిక అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో ఉన్న సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాల తరలింపు విషయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ శాఖ అధికారులపై ఆయన మండిపడ్డారు. అక్కడి ••స్ట్రిక్ట్ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్‌ ‌రిజిస్టేష్రన్‌ ‌కార్యాలయం పేరుతో పఠాన్‌చెరు నియోజకవర్గం కర్ధనూర్‌కు తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించారు. అవసరమైతే అక్కడ ఉన్న పఠాన్‌చెరు సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాన్ని పఠాన్‌చెరుకు తీసుకెళ్లవచ్చని సూచించారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడే వరకు ఎలాంటి తరలింపు ఆలోచన చేయవద్దన్నారు. ఇది కేవలం సూచన కాదు.. హెచ్చరికగా పరిగణించాలి అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *