– మంత్రి జూపల్లి కృష్ణారావు
– నారెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నదని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ లో నిర్వంహించిన నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, జూపల్లి కృష్ణారావులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగామిక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు. రియలేస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇటీవల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లభించడం పెట్టుబడిదారులు, రియల్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నరెడ్కో ప్రెసిడెంట్ విజయ్‌సాయి మేక, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, కిరణ్, నరెడ్కో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పీఎస్ రెడ్డి, ఎం.వెంకయ్య చౌదరి, పి.రవిరెడ్డి, స్వామినాథన్, కాళీప్రసాద్, వెంకటేష్, హరిబాబు, దశరథ్ రెడ్డి, కిరణ్, ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





