సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు శనివారం అక్కడ అంత్య క్రియలు నిర్వహించనున్నారు. దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందురు జానారెడ్డి తదిరులు కూడా రాంరెడ్డి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



