హారీష్‌రావు తండ్రి మరణం పట్ల రామచందర్‌రావు సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి హరీష్‌ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీష్‌ రావు కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మంత్రి దుద్దిళ్ల సంతాపం

ఎమ్మెల్యే హరీష్‌ రావుకు పితృ వియోగం కలిగిన వార్త పట్ల ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ౖ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో హరీష్‌ రావుకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *