వేములవాడ, ప్రజాతంత్ర,అక్టోబర్ 22: కార్తీక మాసం కావడంతో వేములవాడ రాజన్నకు భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. అయితే ఉదయం నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్ చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చామని భక్తులు వెల్లడించారు. ఉదయం స్వామివారికి అభిషేకం చేసుకునే భక్తులకు మాత్రం అనుమతినివ్వగా భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆలయంలో రేకుల షెడ్డు తొలగించే పనుల్లో భాగంగా బంద్ చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రచార సాధనాలు పెరిగాయని, ముందస్తు సమాచారం ఇచ్చి ఆలయాన్ని మూసివేస్తే బాగుంటుంది కదా అని భక్తుల అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా భక్తులు ఉత్తర ద్వారం వద్ద చేరుకొని ఉన్న భక్తులైనా దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అధికారుల ఆదేశాల మేరకే భక్తులను నిలిపివేశామని భద్రత సిబ్బంది వెల్లడించడంతో గంటలతరబడి భక్తులు అవకాశం కోసం ఎదురు చూశారు. ఇక చేసేదేమీ లేక కొందరు భక్తులు బయట నుండే స్వామి వారికి దండం పెట్టి వెనుతిరిగారు. మరోవైపు ఆలయంలో భక్తుల దర్శనాల నిలిపివేతపై స్పష్టమైన ప్రకటన అధికారికంగా ఇవ్వకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




