పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం
రాగల ఐదు రోజుల్లో వర్షాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పనుల మీద బయటకు వెళ్లిన వారు, వాహనదారులు తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. కాగా, నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. రాగల ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిరచింది. దక్షిణIపశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షం కురవొచ్చని, ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.





