జర్మనీలో కాంగ్రెస్‌ ‌అగ్రనేత రాహుల్‌ ‌పర్యటన

– మ్యూనిచ్‌లో బీఎండబ్ల్యూ ప్లాంట్‌ ‌సందర్శప
– తయారీరంగం బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచన

బెర్లిన్, డిసెంబర్‌ 17: ‌జర్మనీలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్‌ ‌గాంధీ సందర్శించారు. అందులోని తాజా మోడల్‌ ‌కార్లు, ఎలక్ట్రిక్‌ ‌బైక్‌లు.. ఎం సీరిస్‌, ‌బీఎండబ్ల్యూ ఐఎస్‌3, ‌రూల్స్ ‌రాయిస్‌ ‌తదితర వాహనాలను పరిశీలించారు. అనంతరం రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ తయారీ రంగంపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో చిరు వ్యాపారులను పట్టించుకోవడం లేదంటూ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ‌వేదికగా ఒక వీడియోను పోస్ట్ ‌చేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీఎస్‌ 450 ‌సీసీ మోటర్‌ ‌సైకిల్‌ను బీఎండబ్ల్యూ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇది భారతీయ ఇంజినీరింగ్‌ ‌పనితనానికి గర్వకారణంగా ఉందన్నారు. తయారీ రంగం బలమైన ఆర్థికాభివృద్ధికి వెన్నుముక వంటిందని అభివర్ణించారు. కానీ విచారం ఏమంటే భారత్‌లో మాత్రం ఈ తయారీ రంగం అనేది తగ్గిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వేగవంతం చేయాలంటే.. మనం మరిన్ని ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ఈనెల‌ 15 ‌నుంచి 20వరకు జర్మనీ రాజధాని బెర్లిన్‌ ‌వేదికగా ఇండియన్‌ ఓవర్సీస్‌ ‌కాంగ్రెస్‌ ‌జరుగుతున్న‌ది. ఇందులో పాల్గొనేందుకు లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ జర్మనీ వెళ్లారు. రాహుల్‌ పర్యటనపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. ఒక వైపు పార్లమెంట్‌ ‌శీతకాల సమావేశాలు జరుగుతుండగా ఆయన విదేశాలకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియదని ఆ పార్టీ అభిప్రాయపడింది. అంతేకాదు లీడర్‌ ఆఫ్‌ ‌పర్యటన్‌, ‌లీడర్‌ ఆఫ్‌ ‌పార్టీయింగ్‌ అని వ్యాఖ్యానించింది. బీజేపీ విమర్శలపై రాహుల్‌ ‌సోదరి ప్రియాంకా గాంధీ కాస్త ఘాటుగా స్పందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *