– పాలేరు నియోజకవర్గంలో 65% ప్రజలకు ఉచితవిద్యుత్
– పవర్ కట్‌ల బాధ వుండదు
– ప్రతి హామీని అమలు చేస్తున్నాం
– రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నాం
– ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నేలకొండపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం అనంతనగర్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించి, ఇంకొకసబ్ స్టేషన్‌కు పాలేరు నియోజకవర్గంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా, లో వోల్టేజ్ లేకుండా, కరెంట్ కట్ లేకుండా గృహ, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. అతి తక్కువ సమయంలో సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించడం సంతోషకరం, మరో సబ్‌స్టేషన్‌ను కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు పాలించి వాగ్దానాలు చేసి,8.5 లక్షల కోట్ల అప్పులు పెట్టి, ప్రజలకు ఏమీ చేయలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలే కేంద్రంగా పాలన కొనసాగిస్తున్నదన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా పాలేరు నియోజకవర్గంలో 65% కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున ప్రతి నెల విద్యుత్ శాఖకు నిధులు కేటాయిస్తూ పేదలకు బిల్లు రహితం చేస్తోంది.పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ కోసం సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65-70% మద్దతు, సర్పంచుల విజయాలు ప్రజా పాలనపై ప్రజల నమ్మకాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ ప్రతి పైసాను ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని, దోపిడీకి కాదని..సంపాదంతా ప్రజలకు, ప్రజలచే, ప్రజల కోసం అనే సూత్రంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున సంక్షేమం అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి (హౌసింగ్, ఇన్ఫర్మేషన్) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంస్థ చైర్మన్ లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, జిల్లా కలెక్టర్ , ఎన్పిడిసిల్ సీఎండీ వరుణ్ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు, అనంతనగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



