హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రాణాభివృద్ధి శాఖ తెలిపింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిశుభ్రత, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. పది రోజుల కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ పురోగతి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 6న ఉమ్మడి జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మంచి పనితీరు కనబర్చిన కార్యాలయాలు, సంస్థలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పత్రాలు అందించాలని’ ఉత్తర్వులో ఆయన వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.