– ఉభయ సభల్లో చర్చకు పట్టు
– గందరగోళం మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూదిల్లీ,డిసెంబర్ 2: వోటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లాయి. వోట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్‌సభ ను అదుపులో పెట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. రెండోసారి సభ పునఃప్రారంభ మైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. వోటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి వోట్లు దోచిపెట్టే పని చేస్తున్నదని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





