: ప్రొ. మాడభూషి శ్రీధర్
Ø అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ స్మారకోపన్యాసం
Ø రాజ్యాంగ పీఠికా పఠనం
డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రాజ్యాంగం, నేరం మరియు ప్రజాస్వామ్య నైతికత” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, (హైదరాబాద్) ఆచార్యులు మాడభూషి శ్రీధర్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రధాన సూత్రాలు, ప్రక్రియలను ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అణగదొక్కే చర్యగా కనిపిస్తోందని అభిప్రాపడ్డారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని ఆయన వివరించారు. ఇది సహజమైన భావన కాదని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజ్యాంగ విలువలను కాపాడాలని సమాజంలో ప్రజాస్వామ్యం వృద్ధి చెందాలంటే దానిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రొ. శ్రీధర్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించడం అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల, సంస్థల నైతిక విలువలు, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య ప్రక్రియలను గౌరవించడం మొదలగునవి ముడిపడి ఉంటాయన్నారు. రాజ్యాంగ నైతికత అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, లౌకికవాదం, చట్టపరంగా చేసే పాలన వంటి రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రధాన విలువలు, సూత్రాలకు కట్టుబడి ఉంటుందన్నారు. రాజ్యాంగం ఆత్మగా పరిగణించబడుతు, ప్రభుత్వ, న్యాయవ్యవస్థ, పౌరుల చర్యలను మార్గనిర్దేశం చేస్తుందన్నారు. తద్వారా దోషిగా నిరూపించబడే వరకు నిర్దోషిగా భావించే రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని అన్నారు. రాజ్యాంగ నైతికత చట్టబద్ధంగా అమలు చేయగలిగినప్పటికీ, రాజకీయ లేదా ప్రజాస్వామ్య నైతికతను అనేక అంశాలను చట్టంలో ఖచ్చితంగా క్రోడీకరించబడలేదుని వివరించారు. తీవ్రమైన నేరానికి శిక్ష పడితే పదవి నుండి అనర్హతకు దారితీయవచ్చు, నేరారోపణలు చాలా కాలం పెండింగ్‌లో ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని, తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజకీయ నేతలు ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు పేరుకుపోవడం అనేది రాజ్యాంగ, న్యాయ వ్యవస్థ పట్ల చులకన భావాన్ని తెస్తుందన్నారు.
కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించి, మాట్లాడుతూ ప్రజాస్వామ్య నైతికత ఎలా విఫలం అవుతున్నది అనే విషయం స్థూలంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య నైతికత విఫలం అయితే రాజ్యాంగం పూర్తి స్థాయి అమలులో విఫలం అవుతదని, రాజ్యాంగ చివరి సభలో సమావేశంలో డా. బి .ఆర్.అంబేడ్కర్ స్పష్టంగా ప్రస్తావించారని వివరించారు.
గౌరవ అతిధిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్ప చక్రపాణి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్.విజయ కృష్ణ రెడ్డి మాట్లాడారు. అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది మరియు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయంలోని డా. బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి రాజ్యాంగం పీఠిక పఠనం చేస్తూ రాజ్యాంగ విలువలను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.





