మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం
న్యూదిల్లీ,జూన్4: బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. బెంగళూరులో ఆర్బీబీ విజయోత్సవ ర్యాలీ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట భయానక దృశ్యాల్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ విషాదకర ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఈ వేడుకలకు మేము ఊహించలేని విధంగా జనాలు వచ్చారని సీఎం అన్నారు. స్టేడియం సామర్థం 35,000 మంది కాగా, అనూహ్యంగా రెండు నుంచి మూడు లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు.
బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి





