– మునుపటి రికార్డు(చదరపు గజానికి రూ.88,000) బద్దలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గంలో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు ఎకరం భూమి వేలాన్ని మంగళవారం విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.3,40,000ల చొప్పున గణనీయమైన ధర పలికింది. ఈ చరిత్రాత్మక ధర 2017లో నమోదైన (చదరపు గజానికి రూ.88,000) రికార్డును బద్దలు కొట్టింది. విజయవంతమైన ఈ- వేలం హైదరాబాద్‌ను అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా మరింత పటిష్టం చేస్తుంది.. ఇక్కడ పరిమితంగా ఉన్న అధిక నాణ్యత గల స్థలాలకు అపారమైన విలువ లభిస్తుందని, ఇది ప్రభుత్వానికి విలువ చేకూరుస్తుందని రుజువు చేస్తోంది. టీజీఐఐసీ వీసీ అండన మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ ఈ-వేలంలో స్థిరంగా నమోదవుతున్న అధిక పనితీరు, ముఖ్యంగా బొటిక్ మల్టీ యూజ్ అభివృద్ధికి అనువైన ప్లాట్ల విషయంలో హైదరాబాద్ ఆర్థిక వృద్ధి అసాధారణమైన లోతు పరిపక్వతను ప్రదర్శిస్తోందన్నారు. నగరంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న, అధిక రాబడినిచ్చే వ్యాపార కారిడార్‌లో ప్రధానమైన స్థలాలను దక్కించుకోవడానికి డెవలపర్లు వ్యూహాత్మకంగా ప్రీమియం చెల్లించి మరీ పెట్టుబడి పెడుతున్నారు అని వ్యాఖ్యానించారు. పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన తెలంగాణను నిర్మించడంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు పరివర్తనాత్మక దృష్టికి ఈ~వేలం చరిత్రాత్మక విజయం ఒక నిదర్శనం అన్నారు. రాయదుర్గంలో జరిగిన ఈ కీలక ఒప్పందం భారతదేశపు అగ్రగామి పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేస్తూ అపూర్వమైన విశ్వాసాన్ని, మూలధనాన్ని ఆకర్షిస్తోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



