న్యూదిల్లీ, జనవరి 8: ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐసీడిఈఎం–2026)కు ముందస్తు సన్నాహకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవోలు)తో న్యూదిల్లీలోని ఐఐఐడిఈఎంలో సమావేశాన్ని గురువారంనిర్వహించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత్ మండపంలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో దాదాపు వందమంది అంతర్జాతీయ ప్రతినిధులతో 40కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు, 36 బ్రేక్‌అవుట్ సెషన్లు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎలక్షన్ కమిషనర్లు డా. సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డా. వివేక్ జోషిలు ఆ సదస్సు నిర్వహణ, సీఈవోల బాధ్యతలపై వివరించారు. సీఈవోలు 36 థీమెటిక్ గ్రూపులపై చర్చించారు. ఇవి ఎన్నికల నిర్వహణ అంశాలను కవర్ చేస్తూ ప్రపంచ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ బాడీల అనుభవాల ఆధారంగా జ్ఞానభాండాగారం రూపొందిస్తాయి. ప్రారంభ సభ, ఈఎంబీ లీడర్స్ ప్లీనరీ, వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్, ఈసీఐనెట్ ప్రారంభం వంటి సెషన్లు ఉంటాయి. 4 ఐఐటీలు, 6 ఐఐఎంలు, 12 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఐఐఎంసీలు పాల్గొననున్నాయని, గ్లోబల్ ఎలక్టోరల్ అంశాలు, ఉత్తమ పద్ధతులు, నూతన ఆవిష్కరణలపై థీమెటిక్ చర్చలు జరుగనున్నాయని వారు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





