హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతోందని వెల్లడించారు. అభ్యర్థులు ఎవరున్నా.. అందరూ కలిసి పనిచేస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్నమంచి పనులే గెలిపిస్తాయని అన్నారు. బిఆర్‌ఎస్‌ను ఎవరూ నమ్మడం లేదన్నారు.
జూబ్లీహిల్ ఉప ఎన్నికలో గెలుస్తాం: మంత్రి పొన్నం



