విద్య‌కు అధిక ప్రాధాన్య‌త‌

-ఏ భాష‌కూ మేం వ్య‌తిరేకులం కాదు
-పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే ఇంగ్లీషులో ప్రావీణ్యం వుండాలి
– ప‌నిలో నైపుణ్యాలు అవ‌స‌రం
– మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: శాతవాహన యూనివర్సిటీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేశార‌ని, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. శ‌నివారం  ఆయ‌న శాతవాహన యూనివర్సిటీ లో అంతర్గత నీటి సరఫరా కోసం రూ.2.10 కోట్ల తో ఏర్పాటు చేయ‌నున్న పైప్ లైన్ కు శంకుస్థాప‌న‌తో పాటు, రినోవేష‌న్  చేసిన ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ కి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామ‌న్నారు. 2004- 09 మధ్య వచ్చిన ఇంజనీరింగ్ కాలేజి జీవన్ రెడ్డి,తరువాత వచ్చిన ఇంజనీరింగ్ కళాశాల శ్రీధర్ బాబు  తీసుకుపోయారన్నారు. తరువాత చాలా కాలం తర్వాత హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి, శాతవాహన యూనివర్సిటీ కి లా కాలేజి తెచ్చుకున్నామ‌న్నారు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ లో అడ్మినిస్ట్రేటివ్ భవనంలో మొదటి అంతస్తుకు ,యూనివర్సిటీ లో అంతర్గత పైప్ లైన్ కు శంకుస్థాపన చేసుకోవ‌డం ఆనందంగా వుంద‌న్నారు. పార్ల‌మెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు ఫుడ్ అండ్ సైన్స్ కోర్సు తీసుకువ‌చ్చామ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో విద్య‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్నారు. యంగ్ ఇండియా స్కిల్  యూనివర్సిటీ ,యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఐటీఐ లను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అభివృద్ధి చేస్తామ‌న్నారు.  మాతృ భాష ,జాతీయ భాష , అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంద‌న్నారు. ఏ భాషకూ మేము వ్యతిరేకం కాదు అన్ని నేర్చుకోవాలి, కాంపిటీటివ్ లో ముందుకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ లో శిక్షణ పొందాలి. పనిలో స్కిల్స్ ఉంటే లక్ష రూపాయల జీతాలు కూడా వస్తున్నాయ‌న్నారు.  శాతవాహన యూనివర్సిటీ కి ఫార్మసీ ,లా కాలేజి,ఇంజనీరింగ్ కాలేజి ఇటీవల  వచ్చాయి. జిల్లా మంత్రులు ,ఎమ్మెల్యేలు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ లోనే అత్యున్నత స్థానం పొందేలా విద్యార్థులు , అధ్యాపకులు అందిపుచ్చుకోవాల‌న్నారు. పోటీ ప్రపంచంలో మీ గమ్యాన్ని చేరుకునేలా క‌ష్ట‌ప‌డాల‌న్నారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, మార్చి లోపు ఇంకో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌న్నారు.  శాతవాహనులు పరిపాలించిన గడ్డ, ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుందామ‌న్నారు.  శాతవాహన ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా జరుపుకుందామ‌న్నారు.  జిల్లా కేంద్రం బిడ్డగా యూనివర్సిటీ నీ మరింత అభివృద్ధి చేస్తామ‌న్నారు. జిల్లాలో 4 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు.. కోర్టులలో వ్యవసాయ కాలేజి ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ ,సిరిసిల్లకు రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాం.  మోడల్ స్కూల్ లు తెచ్చాం.పాస్ పోర్ట్ ఆఫీస్ తెచ్చాం.  తిరుపతికి రైలు తెచ్చాం.రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు.  ఉమ్మడి జిల్లాకు ఎక్కడ విద్యకు సంబంధించిన సమస్యలు ఎదురైన మా ప్రజాప్రతినిదుల దృష్టికి తీసుకురండి. డిసెంబర్ 4 న ముఖ్యమంత్రి  పెద్దపల్లి వచ్చినప్పుడు లా కాలేజి, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రకటన చేశారు. చాలా సంవత్సరాలుగా లా కాలేజి ఇంజనీరింగ్ కాలేజి కోసం తిరిగినం.శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి లో 240 సీట్లకు 160 సీట్లు మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ లో నిండాయ‌న్నారు.  శాతవాహన యూనివర్సిటీ మరింత అభివృద్ధి చేయడం లో ముందుంటామ‌న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్ ,ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *