న్యూదిల్లీ, జనవరి 7: దిల్లీలో గాలి నాణ్యతలు పడిపోవడమేగాక చలి తీవ్రత కూడా పెరిగింది. బుధవారం ఉదయం, మధ్యాహ్నం దట్టమైన పొగమంచు కురవడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం దిల్లీలో ఎక్యూఐ 336 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వెరీ పూర్ కేటగిరీలో వర్గీకరించింది. నెహ్రూ నగర్‌లో ఎక్యూఐ 360 స్థాయిలు నమోదయ్యాయి. 21 పర్యవేక్షణా కేంద్రాల్లో ఎక్యూఐ స్థాయిలు వెరీ పూర్, 14 కేంద్రాల్లో పూర్ కేటగిరీలో నమోదయ్యాయని సిపిసిబి పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


