హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 11 : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్‌రెడ్డి గురువారం నాడు వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును ఆయన పర్యవేక్షించారు. తన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిజిపి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ , కౌంటింగ్బిఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్, ఇంటెలిజెన్స్ అదనపు డిజిపి విజయ్ కుమార్‌లతో కలిసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3,000కు పైగా గ్రామ పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేసినట్లు డిజిపి తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టామని శివధర్‌రెడ్డి వివరించారు.సున్నితత్వం ఆధారంగా అన్ని పోలింగ్ కేంద్రాలను ‘క్లిష్టమైన’, ‘సాధారణ’ కేంద్రాలుగా వర్గీకరించి, ఆయా ప్రాంతాల భద్రతకు అనుగుణంగా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్‌ను డిజిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశామని, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





