రాజకీయాలకు దూరం కావొచ్చు : మల్లారెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్‌ఎస్‌ పార్టీ వైపా అన్నది కాదని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా లేదని కూడా అన్నారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని, ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అసలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *