.తెలంగాణలో మూడు ముఖ్యమైన అంశాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడిచాయి.మొదటిది కవిత లేఖ, బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు..రెండోవది కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ..మూడోవది అధికార పార్టీలో మంత్రి పదవుల పందెరం..జనాల మౌలిక సమస్యలను గాలికి వదిలేసి ఈ మూడు అంశాల చుట్టే ప్రభుత్వం,మీడియా తిరిగాయి.రాష్ట్రంలో ఈ మూడు సమస్యలు కాకుండా ఇతర సమస్యలు లేవా అంటే అనేక సమస్యలు ఉన్నాయి..కానీ వాటిని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం, కవర్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయి.వెరిసి ప్రభుత్వం మీడియా సిండికేట్‌గా మారి ప్రజలను పట్టించుకోవడమే మానేశారు.
బీఆర్ఎస్ జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ చుట్టు ఉన్న కోటరిపై కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన రహస్య లేఖ బయటకు రావడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది.ఎప్పటి నుంచి బీఆర్ఎస్‌లో, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు కోరుకుంటున్న వారికి కవిత లేఖ ఒక రాజకీయ అస్త్రంగా మారింది.కేసీఆర్ ఫ్యామీలలో చిచ్చు పెట్టాలని, బీఆర్ఎస్‌నులో షిండేలాను తయారు చేసి పార్టీని విభజించాలని చూసిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్..రెండు జాతీయ పార్టీలు కవిత లేఖను పొలిటికల్ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది.కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారు. గులాబీ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవతుందని, కవిత లేఖలో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని బీజేపీ నేతలు.లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకున్నారు.కవిత రేవంత్ వదిలిన బాణం అని బీజేపీ.లేదు లేదు, బీజేపీ వదిలిన బాణం అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.ఎవరికీ వారు కవిత ఎపిసోడ్‌ను రాజకీయ లబ్దికోసం వాడుకునే ప్రయత్నం చేశారు.
ఇక కవిత లేఖపై మీడియా ప్రదర్శించిన అత్యుత్సహం అంతాఇంతా కాదు..రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్లు కవిత ఇష్యూపై రోజుల తరబడి హడావుడి చేశారు..ప్రైమ్ టైం డిబేట్లు నడిపారు..నిజానికి కవిత లేఖ రాయడం కామన్, అందులోనూ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోలేదు.. లేఖ పెద్ద ఇష్యూనే కాదు.అధికారంలో ఉన్న పార్టీలో ఇలాంటి ఇష్యూ వస్తే అది ప్రభుత్వం మనుగడపై పడుతుంది కాబట్టి అది ప్రాధాన్యత వార్త అవుతుంది.ప్రతిపక్ష పార్టీలో ఇలాంటి సమస్యలు ప్రభుత్వంపై ఎఫెక్ట్ చూపవు, ప్రభుత్వం పడిపోదు. వెరసి ప్రాంతీయ పార్టీలో అధికారం, రాజకీయ వారసత్వంపై విభేదాలు సర్వసాధారణం. అన్నదమ్ములు, అన్న చెల్లెల్లా మధ్య ఆధిపత్య పోరు కామన్.అస్థిత్వం, ఆత్మగౌరవ చైతన్యం ఎక్కువ ఉన్న తెలంగాణలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
బలగం సినిమాలో చూపించినట్లు చిన్న నల్లి బొక్క కోసమే కుటుంబంలో ఈగోలు పెరిగాయి..అలాంటి రాజకీయ పార్టీల్లో కామన్..అయితే ప్రజా సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉపయోగపడుతాయేమో గానీ తెలంగాణ ప్రజలకు పైసా ప్రయోగజనం జరగదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దృష్టి మలర్చడమే కాబట్టి కవిత ఇష్యూ రాజకీయంగా వాడుకుని లబ్దిపొందే ప్రయత్నం చేసి విఫలం అయింది.అటు ఎప్పటి నుంచో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపర్చి ఆ గ్యాప్‌ను తాము పూడ్చాలని ఎదురుచూస్తున్న బీజేపీ కవిత లేఖతో బీఆర్ఎస్‌లో విభేదాలంటూ ప్రచారం చేసింది.చేయడమే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని, కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షమని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.
అయితే కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు మరోసారి కాంగ్రెస్, బీజేపీలు బోల్తా కొట్టాయి.బీఆర్ఎస్ లో కవిత ఇష్యూను కేసీఆర్ టీ కప్పులో తుఫాన్ గా మార్చారు..కవిత లేఖపై, కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయన్న ఆరోపణలపై కేసీఆర్ మౌనంగానే ఇష్యూను క్లోజ్ చేశారు..చాలా చాకచక్యంగా కవిత ఇష్యూను ముగించారు.తనను కేసీఆర్‌కు దూరం చేయాలని కొంత మంది చూస్తున్నారు.తన తండ్రిని కలవనీయడం లేదని కవిత చేసిన వ్యాఖ్యలతో మీడియా మొత్తం జనాల సమస్యలు గాలికి వదిలేసి దీనిపై ఫోకస్ పెట్టింది.నిజానికి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా వారం రోజులు కవిత ఎపిసోడ్‌పై దృష్టి సారించారు. అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆశలను మాజీ సీఎం కేసీఆర్ అడియాశాలు చేశారు..రెండు రోజుల్లోనే కవిత ఇష్యూను చర్చలో లేకుండా చేశారు.
అమెరిక నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత ఎయిర్‌పోర్ట్‌లో చేసిన హాడావుడితో ఇక బీఆర్‌ఎస్ పని ఖతం అయిందని, కవిత సొంతగా పార్టీ పెడుతుందని, పార్టీ పేరు డేట్స్ కూడా బీజేపీ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు..ఇక తెలంగాణకు తామే దిక్కు అని కాంగ్రెస్, తామే ప్రత్యామ్నయమని కలలు కన్న జాతీయ పార్టీలకు రెండు రోజుల్లోనే కవిత షాక్ ఇచ్చింది.మాట మార్చి కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు రెండు కళ్లు అని ప్రకటించి జాతీయ పార్టీలకు దిక్క తిరిగే షాక్ ఇచ్చింది. తన తండ్రిని కలవనీయడం లేదని, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేసింది, తన లేఖ ఎవ్వరు బయటపెట్టారో తెలియాలని కవిత చేసిన డిమాండ్ సహజంగా బీఆర్ఎస్ కేసీఆర్ వ్యతిరేక మీడియాలో పతకాశీర్షికలయ్యాయి.అయితే కవితను షిండేగా మార్చబోయి కాంగ్రెస్, బీజేపీ బొక్క బోర్లా పడ్డాయి..కవితను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్దికోసం ప్రయత్నించి జాతీయ పార్టీ నేతలు తెలంగాణలో జోకర్లు అయ్యారు.కవితను అడ్డుపెట్టుకుని కేసీఆర్ పై కక్ష్య సాధింపు చర్యలకు దిగాలని చూశారు.
ఇక కవిత లేఖపై మీడియా ప్రదర్శించిన అత్యుత్సహం అంతాఇంతా కాదు..రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్లు కవిత ఇష్యూపై రోజుల తరబడి హడావుడి చేశారు..ప్రైమ్ టైం డిబేట్లు నడిపారు. అయితే ప్రజా సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉపయోగపడుతాయేమో గానీ తెలంగాణ ప్రజలకు పైసా ప్రయోగజనం జరగదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దృష్టి మలర్చడమే కాబట్టి కవిత ఇష్యూ రాజకీయంగా వాడుకుని లబ్దిపొందే ప్రయత్నం చేసి విఫలం అయింది.అటు ఎప్పటి నుంచో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపర్చి ఆ గ్యాప్‌ను తాము పూడ్చాలని ఎదురుచూస్తున్న బీజేపీ కవిత లేఖతో బీఆర్ఎస్‌లో విభేదాలంటూ ప్రచారం చేసింది.చేయడమే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని, కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షమని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.
అనూహ్యంగా బుధవారం కవిత ఫామ్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు..కేసీఆర్‌ను కలవకుండా తనను కొంత మంది దెయ్యాలు అడ్డుకుంటున్నాయని చెప్పి కవిత సడెన్‌గా ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు..భేటీలో ఏం చర్చించారు..కేసీఆర్ కవితను పిలిపించారా..లేక కవితే డైరెక్ట్‌గా తన తండ్రి దగ్గరకు వెళ్లిందా అన్నది పక్కన బెట్టితే..లేఖ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న సహజంగా ప్రజల నుంచి ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు అడ్డుకోలేని వారు అప్పుడు ఏలా అడ్డుకునే వారు అంటు కవిత తీరుపై మండిపడుతున్నారు.కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాన్ని బయట పెట్టకుండానే కవిత తన తండ్రిని కలవడంతో కవితను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్న కాంగ్రెస్, బీజేపీలకు సహజంగానే ఈ కలయిక రుచించడం లేదు.కవిత ఇచ్చిన ఈ షాక్‌తో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు దిమ్మతిరి మైండ్ బ్లాంక్ అయింది.ఇప్పటికీ ఆ షాక్ నుంచి జాతీయ పార్టీలు బయటపడేకపోతున్నాయి.
అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, పవర్‌లోకి వచ్చేది తామే అన్న బీజేపీలు అధికార అహంకారంతో జాతీయ పార్టీల కళ్లు మూసుకుపోయాయి.కవిత వెనుక ఉన్నది నువ్వంటే నువ్వు అని దుమ్మెత్తి పోసుకున్నాయి కానీ, అసలు కవిత ఉన్నదెవ్వరూ, ఏవరి మార్గదర్శకంలో కవిత అడుగులు వెస్తుందన్న విషయాన్ని పట్టించుకోలేదు..కవిత ఇష్యూ తమకు మంచి చేస్తుందా చెడు చేస్తుందన్న ఆలోచన లేకుండా కవిత పొలిటికల్ ట్రాప్‌లో జాతీయ పార్టీలు పడ్డాయి. మీడియా కూడా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యహరించాయి తప్ప..కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయా..?, ఆ దెయ్యాలు కేటీఆరా, హరీష్‌రావా, సంతోష్ రావా అంటూ రంధ్రానేశ్వేషణ చేశాయి తప్ప..అసలు దెయ్యం కేసీఆర్ అని గుర్తించ లేదు..కేసీఆర్ డైరెక్షన్ లో నే కవిత నడుస్తుందా..అని పరిశోధించకుండా కవిత ట్రాప్‌లో పడ్డాయి అని చెప్పవచ్చు.
అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ట్రాప్ చేయడానికి కేసీఆర్ ఆడిన పొలిటికల్ గేమ్ అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.కవిత విషయంలో కేసీఆర్ గేమ్ లో బీజేపీ, కాంగ్రెస్ బలయ్యాయంటున్నాయి రాజకీయ వర్గాలు.కవిత లేఖతో బీఆర్ఎస్ తెలంగాణ పక్షమే అన్న సందేశం ఇచ్చారంటున్నారు.కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లని, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కవిత పదేపదే ప్రకటిస్తుంది.కేసీఆర్ రాజకీయ కురువృద్దుడు, ఆధునిక కాలపు చాణక్యుడు..జాతీయ పార్టీల్లో కొమ్ములు తిరిగిన నేతలనే కేసీఆర్ ఢీ కొట్టారు..వారందరినీ రాజకీయంగా మట్టి కరిపించారు..కేసీఆర్ వ్యూహాల ముందు ఎంత గొప్ప రాజకీయ ఉద్దండుడైనా తెలిపోవాల్సిందే..కేసీఆర్ మౌనంగా ఉన్న మాట్లాడిన అది రాజకీయ సంచలనమే..కేసీఆర్‌ను ఎత్తులు అంచన వేయడం ఎవ్వరికి సాధ్యం కాదు.. తాజాగా కవిత విషయంలో కూడా కేసీఆర్ స్ట్రాటజీని జాతీయ పార్టీలు అందుకోలేక పోయాయి.ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు కాంగ్రెస్, బీజేపీల రాజకీయ విమర్శలకు చెక్ పెట్టారు.ఒకేసారి జాతీయ పార్టీల ఆరోపణలకు వారితోనే సమాధానం చెప్పించారు..సొంత పార్టీలో విభేదాల విమర్శలకు పుల్ స్టాప్ పెట్టారు..వారసత్వం పోరాటంలో కేసీఆర్ మాస్టర్ మైండ్ ముందు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి తేలిపోయారు..కేటీఆర్, కవిత ఇద్దరూ బీఆర్ఎస్‌కు రెండు కాళ్ళల పార్టీ నడిపేలా రోడ్ మ్యాప్ సిద్దం చేశారు..కేసీఆర్ ఆలోచనలను అందుకోలేక, కేసీఆర్ వ్యూహాలన్ని అంచనవేయకుండా కాంగ్రెస్ ,బీజేపీలు గులాబీ బాస్ ఉచ్చులో పడ్డారు.
. అంతేకాదు, హరీష్ రావు కు కీలక బాధ్యతలు అప్పగించడందో పాటు కవిత, కేటీఆర్ మధ్య సమనవ్వయ కర్తగా హరీష్ రావు ఉంటూ భవిష్యత్‌లో కేసీఆర్ తో హరీశ్ రావు ఉండేలా కేసీఆర్ రంగం సిద్దం చేసినట్లు తెలుస్తుంది.కవిత చెప్పినట్లు కేసీఆర్ బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్లులాగా మాస్, క్లాస్ తో ప్రజలతో కేటీఆర్ వరస భేటీలు నిర్వహిస్తున్నారు..మరోవైపు గదేళ్లుగా బీఆర్ఎస్‌కు దూరమైన ఉద్యమకారులు, ప్రజా సంఘాలను జాగృతి పేరుతో ఏకం చేసే బాధ్యతను కవిత భుజాలపై కేసీఆర్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుతుంది.అటు బీఆర్ఎస్ పార్టీ వోట్ బ్యాంక్ చీలిపోకుండా కేసీఆర్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకుపోతున్నారు..బీఆర్ఎస్‌కు పదేళ్లు అధికారం ఇచ్చారు.కాంగ్రెస్ ఒక్కసారి కట్టబెట్టారు..ఇప్పుడు బీజేపీ ఒక్క చాన్స్ ఇవ్వండి అని డబుల్ ఇంజన్ సర్కార్‌లో తెలంగాణ అభివృద్ది చెందుతుంది పక్క వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ రోడ్ మ్యాప్ సిద్దం చేశారు..అందులో భాగమే కవిత ఎపిసోడ్ అంటున్నారు మొదటి నుంచి కేసీఆర్‌తో సన్నిహాతంగా ఉన్నవారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థిరమైన వోట్ బ్యాంక్ ఉంది..అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ వోట్ బ్యాంక్ భారీగా తగ్గింది.తగ్గిన వోట్ బ్యాంక్ కాంగ్రెస్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి, బీజేపీల రహస్య ఒప్పందంతో బీఆర్ఎస్ వోట్ బ్యాంక్ బీజేపీకి రేవంత్ సక్సెక్ ఫుల్‌గా మళ్లించినట్లు సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు..అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ వోట్ బ్యాంక్‌ను తిరిగి సాధించేందుకు..అదే టైంలో కాంగ్రెస్ వ్యతిరేక వోట్ బ్యాంక్‌ను, కాంగ్రెస్ వోట్ బ్యాంక్‌ను బీజేపీకి మళ్లించే రేవంత్ రెడ్డి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ కవితను రంగంలోకి దించారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నిపిస్తుంది. రాష్ట్రంలో రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు కవితను కేసీఆరే రంగంలోకి దింపి,ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీలిపోకుండా.బీజేపీకి వెళ్లకుండా..అదే సమయంలో బీఆర్ఎస్ వోట్లు చీలి పోకుండా కవితతో ప్లాన్ చేశారు..బీఆర్ఎస్ వ్యతిరేక వోట్‌ను ,అటు కాంగ్రెస్ వ్యతిరేక వోట్ షేర్లను జాగృతి వైపు తిప్పుకునే కవిత చేత రాష్ట్రంలో కేసీఆర్ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారు..కేసీఆర్ ఊహించినట్లే బీజేపీ, కాంగ్రెస్‌లు ట్రాప్‌లో పడ్డారు..జాతీయ పార్టీల ముసుగు తొలగించి..జాతీయ పార్టీలు ఎప్పుడైనా ప్రాంతీయ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తొక్కేస్తాయని, తెలంగాణకు బీఆర్ఎస్ ఒక్కటే రక్ష అన్న సందేశం ఇచ్చారు.
-తోటకూర రమేష్





