హనుమకొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

– రెండో విడత పోలింగ్ 87.25 కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో గ్రామపంచాయతీలకు రెండో విడతలో సర్పం చ్, వార్డు స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నిక లు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.జిల్లాలో రెండో విడతలో ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైందని పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు మేరకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి అను మతించగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని ఐదు మండలాల్లో ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్మసాగర్ మండలంలో 85.85 పోలింగ్ శాతం నమోదు కాగా హసన్పర్తి మండలంలో 87.90 శాతం, ఐనవోలు మండలంలో 88.61 శాతం, వేలేరు మండలంలో 86.97 శాతం, పరకాల మండలంలో 86.90 పోలింగ్ శాతం: నమోదైనట్లు వెల్లడించారు. ధర్మసాగర్ మండలానికి సంబంధించి 37346 మొత్తం ఓట్లకు గాను 32062 ఓట్లు పోల్ కాగా హసన్ పర్తి మండలంలో మొత్తం ఓటర్లు 23049 కాగా 20260 ఓట్లు పోల్ అయ్యాయి. ఐనవోలు మండలంలో మొత్తం ఓటర్లు 34489 కాగా 30560 ఓట్లు పోల్ కాగా, వేలేరు మండలంలో మొత్తం ఓటర్లు 15749 కాగా 13697 ఓట్లు పోల్ అయ్యాయి. పరకాల మండలంలో మొత్తం ఓటర్లు 15102కాగా 13124 పోల్ అయ్యా యి. మధ్యాహ్నం నుండి రెండు గంటల నుండి. వార్డులు, సర్పంచుల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా వార్డులు, సర్పంచుల ఫలితాలను ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *