నేటి నుంచి పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

– డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24: రాష్ట్ర పోలీస్ విభాగం ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ’74వ బిఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ 2025-26′ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయని డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను డిజిపి తెలియజేస్తూ గచ్చిబౌలిలోని జీ ఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రారంభవేడుకలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా క్రీడా జ్యోతిని వెలిగిస్తారని పేర్కొన్నారు. 25 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు మొత్తం 12 రోజులపాటు సాగే ఈ సంబరాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ బలగాలతో పాటు కేంద్ర పారామిలటరీ దళాల నుండి మొత్తం 43 జట్లు పాల్గొంటున్నాయని, ఇందు లో 34 పురుషుల జట్లు, 9 మహిళా జట్లు తమ ప్రతిభను చాటనున్నాయని వివరించారు. ఈ టోర్నీలో మొత్తం 1038 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, వారిలో 851 మంది పురుషులు, 187 మంది 187 మంది క్రీడాకారిణులు ఉన్నారని ఆయన తెలిపారు. నగరంలోని ఐదు ప్రధాన వేదికలైన గచ్చిబౌలి స్టేడియం, గోల్కొండలోని హెచ్‌ఎఫ్‌సీ స్టేడియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ గ్రౌండ్, శ్రీనిధి ఫుట్‌బాల్ స్టేడియం మరియు గోల్కొండలోని ఆర్టిలరీ గ్రౌండ్స్‌లో మొత్తం 110 మ్యాచ్‌లను అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని జట్ల కెప్టెన్ల ఆధ్వర్యంలో జరిగే మార్చ్‌ పాస్ట్‌లో క్రీడాకారులు గవర్నర్ కు గౌరవ వందనం సమర్పిస్తారని, ఈ వేడుకలో భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్, ఆసియా కప్ సీనియర్ మహిళా జట్టు క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, అర్జున మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, మాజీ భారత కోచ్ నయీముద్దీన్ వంటి క్రీడా దిగ్గజాలు పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగిస్తారని ఆయన వివరించారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలో విజేతలకు ట్రోఫీలను అందజేయడం జరుగుతుందని డిజిపి బి. శివధర్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నైపుణ్యం గల ఫుట్బాల్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నందున క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరుకావాలని సూచించారు. మ్యాచ్ లను ఉచితంగా చూడవచ్చని, క్రీడల పై ఆసక్తి ఉన్నవారు మ్యాచ్ లకు హాజరు కావచ్చని తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *