రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత డాక్టర్ అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యం కారణంగా తన నివాసంలో కుప్పకూలిపోగా, హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. కాకతీయ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలుగు సాహితీ లోకానికి, ముఖ్యంగా తెలంగాణకు తీరని లోటుగా పేర్కొన్నారు.





